దేశంలో కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టడానికి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో రవాణా వ్యవస్థ పూర్తిగి స్థంబించి పోయింది.  ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి ప్రైవేట్ వాహనాలు తీసుకుకొని వెళ్లేవారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సౌకర్యాలే ఏవీ లేకుండా పోయాయి. దాంతో ఆసుపత్రి వెళ్లేవారు.. ఇతర విషయాల్లో ప్రయాణాల చేసేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి.  ఇలాంటి సమయంలో కొన్ని చోట్లు పోలీసులు ఔదార్యాన్ని పాటిస్తున్నారు.  కష్టాల్లో ఉన్నవారిని తమ వాహనాల్లోనే గమ్యస్థానాలక చేర్చుతున్నారు.   లాక్‌ డౌన్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసే విధుల్లో ఉన్న పోలీసులు, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటూ తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. 

 

తాజాగా, అనంతపురం జిల్లా, కల్యాణదుర్గం పట్టణ పరిధిలో, ఎండలో వెళుతున్న ఓ బాలింతను చూసి చలించిపోయిన డీఎస్పీ వెంకటరమణ, తన వాహనంలో ఆమెను ఇంటికి పంపించారు. ఇదిలా ఉంటే..  పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసుల వద్దకు ఓ వ్యక్తి వచ్చి తన కుమార్తే గర్భవతి అని.. అత్యవసర వైద్య పరీక్షల కోసం  హాస్పిటల్ కి వెళ్లాలని కోరారు.

 

వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది  ఆ గర్భవతిని సికింద్రాబాద్ లోని వెస్ట్ మెరీడ్పల్లి వద్ద ఉన్న ఆసుపత్రి వద్దకు తీసుకు వెళ్లి చేర్పించారు.  ఇలా కష్టాల్లో ఉన్న ప్రజలకు పోలీసులు అండదండగా ఉంటున్నారు.. ఇంత మంచి పనులు చేస్తున్న పోలీసులకు సలాం అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: