ఏపీలో క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అటు సీఎం జ‌గ‌న్‌, ఇటు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఇద్ద‌రూ దొందూ దొందే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పోల్చిచూసిన‌ప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో అంత భ‌రోసా క‌ల్పించ‌డం లేద‌న్న టాక్ ఉంది. ఇక ఇటు చంద్ర‌బాబు సైతం ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా ఆయ‌న ఏం సూచ‌న‌లు చేస్తారో ?  చాలా మందికి అర్థంకాని ప‌రిస్థితి. హైద‌రాబాద్‌లో కూర్చొని ఏదో మాట‌లు మాట్లాడుతోన్న చంద్ర‌బాబు సైతం ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తోన్న దాఖ‌లాలు అయితే లేవు. మొత్తానికి క‌రోనా విష‌యంలో కూడా ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య రాజ‌కీయ‌మే న‌డుస్తోంది. 

 

ఇప్ప‌టికే నాలుగైదు సార్లు ప్రెస్‌మీట్ పెట్టిన చంద్ర‌బాబు ఆయ‌న పార్టీ నేత‌లు జిల్లాల వారీగా రాసి ఇచ్చిన స‌మాచారాన్ని చ‌దివేసి ప్రెస్‌మీట్‌ను మ‌మః అనిపించేసి జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక మంగ‌ళ‌వారం ప్రెస్‌మీట్లో చంద్ర‌బాబు మాట్లాడుతూ క‌‌రోనాను త‌క్కువ అంచ‌నా వేయ‌వ‌ద్ద‌ని గ‌తంలోనే చెప్పాన‌ని.. మేం చెప్పే ప్ర‌తి అంశాన్ని వైసీపీ కావాల‌నే రాజ‌కీయం చేస్తోంది. అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని అనేకసార్లు సూచించినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు... ప్ర‌భుత్వం ప్ర‌తి విష‌యంలోనూ ఏక‌ప‌క్ష ధోర‌ణితో ముందుకు వెళుతోంద‌ని ష‌రా మామూలుగానే విమ‌ర్శ‌లు చేశారు.

 

ఇక ఏపీలో మొత్తం 13 జిల్లాల్లో 11 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి.. క‌ర్నూలులో ప‌రిస్థితి తీవ్రంగా ఉంటే ముందు జాగ్ర‌త్త‌లు ఎందుకు తీసుకోలేదు. ఒక డాక్ట‌ర్ క‌రోనా పాజిటివ్ వ‌స్తే ట్రీట్మెంట్ ఇచ్చారు... ఆయ‌న చ‌నిపోయారు... డాక్ట‌ర్ల విష‌యంలో ప్ర‌భుత్వం ఎందుకు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇక వైద్యుల‌కు మాస్క్‌లు, పీపీఈలు అందిస్తున్నారా ? అని ప్ర‌శ్నించారు. ప‌లుచోట్ల పంట‌న‌ష్టంతో రైతులు చ‌నిపోతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న చంద్ర‌బాబు... ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు ఇవ్వ‌డం క‌న్నా అక్క‌డ‌క్క‌డా ఉన్న చిన్న‌చిన్న లోపాల‌ను భూత‌ద్దంలో పెట్టి చూపించే ప్ర‌య‌త్న‌మే చేశారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: