కరుణ మహమ్మారిని కట్టడి చేయడం నానాటికీ కష్టతరమవుతుంది, దేశంలో మర్కజ్  నిజాముద్దీన్ జమాత్   మత ప్రార్థనల అనంతరం వేగంగా పుంజుకుని  విస్తరిస్తున్న వైరస్ దాటికి సాధారణ ప్రజానీకం మరియు వైద్య సిబ్బంది పాజిటివ్ పాలవుతున్నారు. మహారాష్ట్ర దేశంలోనే అత్యధికంగా కరుణ పాజిటివ్ కేసులు కలిగి రాష్ట్రము గా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గంట గంటకు పెరుగుతూనే ఉన్నాయి. పుణేలోని రూబీ హాల్ క్లినిక్లో పనిచేసే 25 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.  

 

ఈ ఇరవై ఐదు కేసులలో లో దాదాపు 19 మంది నర్సులే ఉన్నారు అని హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చెబుతున్నారు. దాదాపు 1000 మంది ఉన్న ఈ క్లినిక్లో అందరికీ టెస్ట్ చేయగా 25 మందికి పాజిటివ్ వచ్చిందని హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలియజేశారు. అయితే ఆ సర్వాడి నుండి వచ్చే ఓ సిబ్బంది నుంచి మిగతా సిబ్బందికి ఈ వైరస్ సోకినట్లు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్లినిక్ చుట్టుపక్కల ఉన్న మూడు హాస్పిటల్  సిబ్బందిని    క్వారంటైన్  కు తరలించ వలసిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు... పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ప్రత్యేక వార్డులలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలియజేస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: