ఇప్పుడు యావత్ భారత దేశం కరోనాపై యుద్దం చేస్తుంది.  ఇప్పటివరకూ 18,600 మందికి పైగా వ్యాధి బారిన పడగా, 590 మంది మరణించారు.  గడచిన 24 గంటల వ్యవధిలో ఇండియాలో 1,336 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 47 మంది ఒక్క రోజులో మరణించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రపంచ దేశాల్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి కేవలం 3 నుంచి 4 రోజుల సమయం మాత్రమే పట్టింది. వివిధ దేశాల్లో లాక్ డౌన్ ను విధించిన తరువాత, ఈ సమయం మెల్లగా పెరుగుతూ వచ్చింది.  

 

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు 872కు పెరిగాయి. అలాగే కరోనా బారిన పడి 23 మంది మరణించారు. అలాగే ఇప్పటి వరకు 186 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉంటే కరోనాని అరికట్టడానికి లాక్ డౌన్ సీరియస్ గా పాటిస్తున్నాం.   ఈ నేపథ్యంలో పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్య కార్మికులు మాత్రంమే బయట ఉంటున్నారు.. వారి సేవలు ఎంతో గొప్పవని ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. కరోనా పట్ల అవగాహన కోసం ప్రజా ప్రతినిధులు సైతం నడుం బిగించారు. 

 

ఈ నేపథ్యంలో తెలంగాణ లో కేటీఆర్, హరీష్ రావు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలే జనాల వద్దకు వెళ్లి వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నామని.. తమ పాప కు పానీ పూరీ కావాలని గగ్గోలు పెడుతుందని ఓ నెటిజన్ కేటీఆర్ కి తమ పాప అంటున్న ముద్దు ముద్దు మాటలను ట్యాగ్ చేసి పెట్టారు.  ఆ పాప నవ్వుకుంటూ కేసీఆర్ తాత నాకు పానిపూరి కావాల...అటూ అడుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: