నిన్న మొన్నటి వరకు పాజిటివ్ కేసులు చాలా తక్కువగా నమోదైన జిల్లా సూర్యాపేట్. ప్రస్తుతం ఈ జిల్లాలో కరోనా విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. ఈ జిల్లాలో ఇప్పటివరకూ 54 కేసులు నమోదు కాగా ఇందులో సూర్యాపేట టౌన్ నుంచి 34 కేసులు నమోదు కావడం  గమనార్హం. అయితే పెరుగుతున్న ఈ కేసులో దృష్ట్యా సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష జరిపారు. ప్రస్తుత పురపాలక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వేణుగోపాల్ రెడ్డి ని సూర్యాపేట ప్రత్యేక  అధికారిగా నియమించారు.

 

సూర్యాపేటలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా లాక్ డౌన్ ని కట్టుదిట్టం చేయడానికి మరియు కరోనా నియంత్రణ చర్యలను చేపట్టడానికి ఈ అధికారిని నియమిస్తున్నట్లు సీఎం తెలియజేశారు. అయితే సూర్యాపేట టౌన్ లోని మార్కెట్లో ఓ వ్యక్తి మర్కజ్ నిజాముద్దీన్  జమాత్ మత ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఈ వైరస్ వ్యాప్తికి శ్రీకారం చుట్టాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మార్కెట్లోని  చేపలు అమ్మేవారు, కూరగాయలు అమ్మే వారు ఈ వైరస్ భారీన  పడ్డట్టు అధికారులు తెలియజేస్తున్నారు. ఇందుమూలంగా కమ్యూనిటీ కాంటాక్ట్స్ జరిగి ఉండవచ్చని వైద్యులు  అనుమానిస్తున్నారు. మార్కెట్ వ్యాపారస్తుల ద్వారా మరీ ఎక్కువ మందికి ఈ వైరస్ వ్యాప్తి జరిగి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు

 

మరింత సమాచారం తెలుసుకోండి: