ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో వైసిపి నాయకులు మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. చంద్రబాబు నాయుడుకి మీడియా ముఖంగా చురకలు వేశారు.  చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులకు ఒకసారి లేక మూడు రోజులకు ఒకసారి మీడియా ముందుకు స్కైప్ ద్వారా  ఉపన్యాసాలు చెబుతూ సూక్తిముక్తావళి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మా పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో  కరోనా టెస్టింగ్ పారదర్శకంగా జరుగుతూ ఉంటే ప్రతిపక్షాలు మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయి.

 

వైసిపి గవర్నమెంట్  కరోనా పాజిటివ్ కేసులను లెక్కకు తగ్గించే చెబుతోందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించగా గా దానికి సమాధానంగా కేంద్ర మంత్రి అంబటి రాంబాబు గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు జరిపిన పాజిటివ్  పరీక్షలన్నీ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసినవే. మా పనితనాన్ని వేలెత్తి చూపించే అవసరం లేదు అని తెలియజేశారు. అదేవిధంగా కరోనా టెస్ట్ కిట్లను కొనటం లో కమిషన్ కొట్టేశా మని చెబుతున్నారు. అది ఏంటి అని అడిగితే ఇన్ఫర్మేషన్ కోసం అలా అడిగానని బీజేపీ ఆ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ఇలా ఇన్ఫర్మేషన్ కోసం డబ్బులు నొక్కేశారు అని అడుగుతారా? అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు....

మరింత సమాచారం తెలుసుకోండి: