దేశంలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని వ్యవస్థలు మూసి ఉన్న దశలో ఎవరూ బయటకు వెళ్లొద్దు అన్న అంక్షాలు జారీ చేశారు.  ఏదో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని అంటున్నా కొంత మంది అదే పనిగా బయటకు రావడం.. గుంపులుగా ఉండటం... మాస్క్ లు ధరించకపోవడం లాంటివి చేస్తున్నారు.  అన్ని రాష్ట్రాల్లో పోలీసులు నయానో.. భయానో చెబుతన్నా పరిస్థితులు మాత్రం అదుపు లోకి రావడం లేదు. పోలీసులు ఎంతగా చెబుతున్నా వినకుండా బయటకు వచ్చిన ప్రజలకు వినూత్న శిక్ష విధించారు పూణె పోలీసులు.

 

భౌతిక దూరాన్ని పాటించడమే కరోనాకు విరుగుడని ఎంతగా చెప్పినా వినకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని ఆడా, మగా అన్న తేడా లేకుండా నడిరోడ్డుపైనే నిలబెట్టి గుంజీలు తీయించారు.  రోడ్డు పైకి వచ్చిన వారిని సామాజిక దూరంలో నిలబెట్టి ఆడా మగా అనే తేడా లేకుండా గుంజీలు తీయించారు.   ఈ ఘటన నగర పరిధిలోని సింఘాడ్ రోడ్డులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: