కరోనా కారణంగా రోజు రోజుకి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిజాముద్దీన్ ప్రార్థనల అనంతరం వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. దీని బారిన  పడి సాధారణ ప్రజానీకం  కొట్టుమిట్టాడుతున్నారు. వైద్యం అందిస్తున్న వైద్య బృందం సరైన ఉపకరణాలు లేక వారు కూడా కరోనా మహమ్మారిని ఆహ్వానించవలసి వస్తుంది. అదేవిధంగా లాక్ డౌన్ లో ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు సైతం ఈ కరుణా కారణంగా బలైపోతున్నారు. దేశంలో సరైన వైద్య సదుపాయాలు లేక సిబ్బంది బాధపడుతున్నారు.

 

అయితే టాటా సంస్థల అధిపతి రతన్ టాటా భారత్  కు 150 కోట్ల పరికరాలను  తమ టాటా ట్రస్ట్ నండి అందించనున్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు తమ  ఎయిర్ లైన్ ద్వారా త్వరితగతిన అందించనున్నారు. ఇందులో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్యుప్ మెంట్ కిట్స్ కు సంబంధించిన అన్ని ఉపకరణాలు మరియు   హ్యాండ్  గ్లోవ్స్ ,  N95 మరియు  KN95 మాస్క్ లను, మెడికల్ మాస్క్లను డిఫరెంట్ గ్రేట్ లతో అందించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: