కరోనా వైరస్‌ తీవ్రత భారత్‌లో రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో మంగళవారం మధ్యాహ్నం వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18601కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. సోమవారం ఒక్కరోజే 705 మంది కరోనా బాధితులు కోలుకున్నారని ఇప్పటి వరకు మొత్తం 3252 మంది డిశ్చార్జ్‌ అయ్యారని ఆయ‌న‌ తెలిపారు. దీంత దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 17.48కు పెరిగిందన్నారు. ఇప్ప‌టికే గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాలు క‌రోనా ర‌హిత రాష్ట్రాలుగా మారిన విష‌యం తెలిసందే.

 

ఇక దేశంలో మ‌హారాష్ట్రలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు ఐదువేల‌కు చేరువ‌లో ఉంది. మ‌ర‌ణించిన వారి సంఖ్య 230కి చేరువ‌లో ఉంది. ఇక ముంబై న‌గ‌రం క‌రోనాకు హాట్‌స్పాట్‌గా మారుతోంది. న‌గ‌రంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య మూడువేలు దాటిపోయింది. మ‌ర‌ణాల సంఖ్య  కూడా 150కిపైగా చేరిపోయింది. ఆ త‌ర్వాత ఢిల్లీ, రాజ‌స్తాన్‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ప్ర‌భావం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: