ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది ఇలాంటి సందర్భంలో చైనా కంపెనీ చేసిన పని పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలుగువాడుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగమైన సోషల్ డిస్టెన్స్ పక్కకు పెట్టేసి  సుజవ్  నగరంలోని   యుయా ఫర్నిచర్ ఫ్యాక్టరీ ఈ ముద్దుల పోటీని నిర్వహించింది. ఆ పోటీలో పాల్గొనేవారు ఫ్లెక్సీ గ్లాస్ తో వేరుచేయబడి ఒకరినొకరు  ముద్దు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఫ్యాక్టరీ పది జంటలను ఎంపిక చేసి ఈ కిస్సింగ్ పోటీలను ప్రారంభించింది.

 

అయితే ఈ కిస్సింగ్ పోటీలో పాల్గొనేవారు ముద్దు పెట్టుకునే క్రమంలో  వారు తమ  ఫేస్ మాస్క్ లను తొలగించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ చేసిన పనిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పుమన్నాయి. కాగా చైనాలో  లాక్ డౌన్ సమయంలో విధించిన ఆంక్షలను వేయడంతో ఆ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించారు. అయితే చాలా రోజుల తర్వాత ఫ్యాక్టరీలో పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ముద్దుల పోటీని నిర్వహించినట్లు ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం తెలియజేస్తున్నది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: