క‌రోనా వైర‌స్ మాన‌వ సృష్టేన‌ని.. అది చైనాలోని వుహాన్ న‌గ‌రంలో ఉన్న ల్యాబ్‌లోనే జ‌నించింద‌ని ఇటీవ‌ల ఫ్రెంచ్ జీవిశాస్త్ర‌వేత్త‌, నోబెల్ గ్ర‌హీత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఎయిడ్స్ వ్యాధికి వ్యాక్సిన్ క‌నిపెట్టే క్ర‌మంలో జ‌రిగిన ప్ర‌మాదం నుంచే క‌రోనా వైర‌స్ పుట్టిందంటూ ఫ్రెంచ్ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విషయాల‌ను వెల్ల‌డించారు. తాజాగా.. చైనాకు చెందిన జీవ‌శాస్త్ర‌వేత్త వుజియోహు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న చైనా గుట్టును బ‌య‌ట‌పెట్టారు. వుహాన్ న‌గ‌రంలో ఉన్న ల్యాబ్ నుంచే క‌రోనా వైర‌స్ పుట్టే అవ‌కాశాలు ఉన్నాయంటూ ఆయ‌న సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. ప్ర‌యోగ‌శాల నుంచే క‌రోనా పుట్టి ఉంటుంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఎందుకంటే.. ఇలాంటి వైర‌స్ ల్యాబ్ నుంచి పుట్టే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉంటాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. దీనిపై మ‌రింత ప‌రిశోధ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విష‌యం అంత‌ర్జాతీయంగా తీవ్ర‌ చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

 

ఇప్ప‌టికే చైనాపై ఉన్న ఆరోప‌ణ‌ల‌కు ఈ జీవ‌శాస్త్ర‌వేత్త వ్య‌క్తం చేసిన అభిప్రాయాలు మ‌రింత బ‌లం చేకూర్చుతున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టికే అమెరికా చైనాపై మండిప‌డుతోంది. ఏకంగా ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని చైనాకు పంపిస్తామని ప్ర‌క‌టించారు అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. మ‌రోవైపు ఆస్ట్రేలియా కూడా క‌రోనా వైర‌స్ పుట్టుక‌, వ్యాప్తిపై అంత‌ర్జాతీయ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసింది. ఈ నేప‌థ్యంలో సొంత దేశ జీవిశాస్త్ర‌వేత్త వ్య‌క్తం చేసిన అభిప్రాయాల‌పై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి. ఎందుకంటే.. ముందుగా క‌రోనా గురించి చెప్పిన డాక్ట‌ర్‌ను అరెస్టు చేయించిన చ‌రిత్ర  చైనాకు ఉంది. చివ‌రికి ఆ డాక్ట‌ర్‌కు క‌రోనాకు బ‌ల‌య్యాడు. ఇప్పుడు ఈ శాస్త్ర‌వేత్త‌పై ఎలా స్పందిస్తుంద‌న్న‌ది అంద‌రిలో ఉత్కంఠ రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: