సింగపూర్ ప్రధానమంత్రి లీ హుస్సేన్ లూంగ్ ఈ విపత్కర సమయంలో ప్రజా ప్రయోజనార్థం ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఆ దేశంలో లాక్ డౌన్ ని  జూన్1వ తారీకు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపాడు. ఈ సర్క్యూట్ బ్రేకర్ టైంలో మరియు కార్మికులకు అండగా నిలుస్తామని ఆయన ప్రకటించాడు.  వ్యాపారాలకు కూడా ఇప్పుడు ఉన్నట్లుగానే వారికీ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చాడు. ప్రాణాంతకమైన  కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ నివారణ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

 

అదేవిధంగా దేశంలో ఉన్న ఇతర వలస కూలీల కు మరియు ఉద్యోగస్తులకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మా దేశంలో ముస్లిం మతస్థుల తో పాటు కలసి రంజాన్ పండుగను జరుపుకుంటామని తెలియజేశాడు. సింగపూర్ లో మంగళవారం కొత్తగా  1111 కరుణ కేసులు నమోదు అయ్యాయి వీరిలో ఎక్కువ శాతం పొరుగు దేశం నుంచి వచ్చిన వలస కార్మికులు ఉన్నారు . దేశంలో ఇప్పటివరకూ  9125  మందికి కరుణ సోకినట్లు ఈ సందర్భంగా తెలియజేశాడు. లాక్ డౌన్ పోడిగింపు వలన వ్యాపారస్తులు కార్మికులు నష్టపోతారని ప్రధాని అన్నారు అయితే ఈ నష్టం స్వల్ప కాలమే వైరస్ అంతమై పోయే వరకు మాత్రమే. దేశ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు లి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: