భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,985కు చేరుకుంది. మొత్తం 603 మరణాలు సంభ‌వించాయి. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశ‌వ్యాప్తంగా ప్రస్తుతం 15,122 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,259 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రాల వారీగా కేసులు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర: 5218, గుజరాత్: 2,178, ఢిల్లీ: 2,156, తమిళనాడు: 1596, మ‌ధ్య ప్రదేశ్: 1,552, ఉత్తర ప్రదేశ్: 1,337, తెలంగాణ: 928, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌:757, జ‌మ్ముక‌శ్మీర్ 380, ఉత్తర్ ప్రదేశ్: 337, ప‌శ్చిమ‌ బెంగాల్: 274, పంజాబ్: 251, బీహార్: 126, కేరళ: 117 క్రియాశీల కేసులు, హిమాచల్ ప్రదేశ్: 40 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

 

ఇప్ప‌టికే గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాలు క‌రోనా ర‌హిత రాష్ట్రాలుగా ప్ర‌క‌టించుకున్నాయి. ప్ర‌స్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు లేక‌పోవ‌డంతో క‌రోనా ఫ్రీ రాష్ట్రాలుగా ముఖ్య‌మంత్రులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక చైనా పంపిన ర్యాపిడ్ టెస్ట్ కిట్లు త‌ప్పుడు ఫ‌లితాలు ఇస్తుండ‌డంతో వాటిని రెండు రోజుల‌పాటు వాడొద్దంటూ ఐసీఎంఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రెండురోజుల పాటు వాటిని వాడొద్దంటూ రాష్ట్రాల‌కు సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: