ఇప్పుడంతా 'బి ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ ట్రెండ్ న‌డుస్తోంది. ఇందులో ప్ర‌ధానంగా టాలీవుడ్ సెల‌బ్రెటీలు పాల్గొంటున్నారు. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రారంభమైన ఈ ఛాలెంజ్‌ను అంద‌రూ పాటిస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన ద‌ర్శ‌కులు, హీరోలు, ఇత‌ర ప్ర‌ముఖులు ఇంట్లో పనులు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మరికొంతమందికి ఆ సవాల్‌ను విసురుతున్నారు. ఈ నేపథ్యంలో జ‌క్క‌న్న‌ ఇచ్చిన సవాల్‌ను స్వీకరించి విజ‌య‌వంతంగా పూర్తి చేశార‌డు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్. చీపురుప‌ట్టి ఇళ్లంతా ఊడ్చిన, త‌దిత‌ర ఇంటి ప‌నుల‌కు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

 

ఇక‌ అందులో సుకుమార్ చేసిన‌ ఇంటి పనికి ఆయ‌న స‌తీమ‌ణి త‌బిత కూడా మార్కులేశారు. బాగా చేశావంటూ మెచ్చుకున్నారు. ఇక తన ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ ప్ర‌ముఖ‌ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్(డీఎస్పీ), ప్ర‌ముఖ‌ దర్శకులు వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, శివ కొరటాల, నిర్మాత దిల్‌ రాజు పేర్లను నామినేట్ చేశారు సుకుమార్. ఇక వీరు ఏమేర‌కు ఇంటిప‌నులు చేసి మెప్పిస్తారో చూడాలి మ‌రి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: