కరోనా  వైరస్ నియంత్రణకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా కరోనా  వైరస్ విజృంబిస్తున్న  నేపథ్యంలో రోజురోజుకు నిబంధనలు సడలిస్తూనే  ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలు బయటకు రావడం వల్ల కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతుందని భావించిన ప్రభుత్వం నిత్యావసరాలను ప్రజలు ఇంటి వద్దకు పంపించాలని  నిర్ణయించింది. దీనికోసం  ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నెంబర్ 08061914960 ని  కేటాయించి సరుకులు  కావాలనుకునే వారు దానిలో లిస్ట్ పెడితే... అక్కడి స్థానిక   ఏజెంట్లు ఇంటికి సరుకులు  తీసుకురానున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. దీనిని ప్రయోగాత్మకంగా బెంగళూరులో ప్రారంభిస్తున్నామని అక్కడ విజయవంతమైతే తర్వాత అన్ని నగరాల్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: