కరోనా ఎక్కడ నుంచి ఎలా పొంచి ఉంటుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది.  అంతా మంచిగా ఉందనుకుంటున్న సమయంలో ఎలా వచ్చి పడుతుందో తెలియని అయోమయ పరిస్థితి.  కరోనా రాకుండా ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే అంటే మంచిది అంటున్నారు.  అయితే అన్నీ తెలిసిన ఓ నర్సు నిర్లక్ష్యం ఓ చిన్నారి పాపకు కరోనా పాజిటీవ్ వచ్చింది.. అంతే కాదు ఆ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు క్వారంలైన్ లో ఉండే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లోని నిమ్స్ లో పనిచేస్తున్న ఓ నర్స్ తన ఇంట్లోని బాలుడిని ముద్దు చేయడంతో ఆమె నుంచి బాలునికి వ్యాధి సోకింది.

 

సదరు నర్స్ కు కరోనా లక్షణాలు ఉన్నా, ఆమె నిర్లక్ష్యంగా వహరించినట్టు తెలుస్తోంది.  ఇప్పటికే తల్లిదండ్రుల నిర్లక్ష్యం, తెలిసీ తెలియని తనంతో చాలా మంది చిన్నారులు వ్యాధి బారిన పడ్డారని అధికారులు అంటున్నారు. 14 సంవత్సరాల లోపు ఉన్న వారిలో 75 మంది, 14 నుంచి 16 ఏళ్ల లోపున్న మరో 70 మంది కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది.  మరీ దౌర్భాగ్యం ఏంటంటే  వీరిలో చాలా కేసులు మర్కజ్ ప్రార్థనలతో సంబంధం ఉన్నావారే అని తేలింది. 

 

 ప్రస్తుతం ఆ చిన్నారి  తల్లిదండ్రులతో పాటు ఆ ఇంట్లోని వారందరినీ అధికారులు క్వారంటైన్ చేశారు. అయితే ఈ కరోనా  కలవర పెడుతున్న విషయం ఏంటంటే, కరోనా సోకి, ఐసొలేషన్ వార్డుల్లో ఒంటరిగా ఉంటున్న చిన్నారులు తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నారు. తమకు అమ్మానాన్న కావాలని అంటూ మారాం చేస్తుంటే అక్కడి వారి గుండె తరుక్కు పోతుంది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: