దేశం మొత్తం ఇప్పుడు కరోనా కష్టాల్లో ఉంది.  ఎక్కడ చూసినా కరోనా పేరు చెబితే భయంతో వణికిపోతున్నారు.  ఈ నేపథ్యంలో ఏపిలో రాజకీయ రగడ కొనసాగుతుంది.  ఓ వైపు ఏపి ముఖ్యమంత్రి తన అధికారులు, మంత్రి వర్గంలో కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతన వైసీపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులపై తిట్లదండకాలు మొదలు పెడుతున్నారు.  తాజాగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై  మరోసారి ప్రశంసలు కురిపించారు.  మనమెవ్వరమూ వెయ్యేళ్లు బతకడానికి రాలేదు.

 

జీవించిన కాలంలో ఎంత గొప్పగా బతికాం, ఎంత ఆదర్శవంతంగా ఉన్నాం అనేదే ముఖ్యం' అని ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ... 'నిజాయతీ మీ యశస్సు, నీతి మీ ఆయుష్షు... జై కేసీఆర్' అని ట్వీట్ చేశారు.  ఏపీ రాజకీయ నాయకులపై బండ్ల గణేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టీవీలు చూస్తుంటే ఏపీ రాజకీయ నాయకులు ప్రతి నెల ఎలక్షన్స్ వస్తాయేమో అనే భయంతో డిబేట్లలో పాల్గొంటున్నట్టు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

 

అయ్యా తెలంగాణలో రాజకీయల గురించి చూస్తే తెలుస్తుంది.. ఎలాంటి సమయంలో స్పందించాలి.. స్పందించకూడదు అన్న విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు అందరూ కష్టకాలంలో ఉన్నారు.. రాజీకీయాలకు ఇది సమయం కాదని సూచించారు.  రాజకీయాలను పక్కన పెట్టి, దేవుడి మీద ప్రమాణాలను పక్కన పెట్టి, ప్రజలను కాపాడాలని చెప్పారు. ఏపీలో గోలలు చూస్తుంటే.. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయనే విషయాన్ని ఏపీ రాజకీయ నాయకులు, ప్రజలు గమనించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: