కరోనా వైరస్ ప్రపంచ దేశాల‌ను  అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేశాయి. అయినప్పటికీ కరోనా కేసులు , మరణాలు తగ్గడం లేదు. రోజు రోజుకూ అంతకంత పెరుగుతూ ప్రభుత్వాలను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.

తాజాగా సింగ‌పూర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క‌రోనాను ఎదుర్కొనేందుకు “లాక్‌డౌన్”‌ను జూన్ 1 వ‌ర‌కు పొడిగించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు దేశ ప్రధాని లీ హ్సేన్ లూంగ్  ప్రకటించారు. మొదట మే 4 వర‌కు “లాక్‌డౌన్‌” ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ  “క‌రోనా” కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఆందోళనకర పరిస్థితి నెలకొనడంతో మ‌రో నాలుగు వారాల వ‌ర‌కు పొడిగింపు తప్పలేదన్నారు ప్రధాని. కాగా, సింగపూర్‌లో ఇప్పటివ‌ర‌కు 9,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..  11 మంది మృతిచెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: