ఓ వైపు కరోనాతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.. మరోవైపు కృర మృగాలు గ్రామాల్లోకి వచ్చి భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ఆ మద్య ఓ చిరుత పులి గొడ దూకి కుక్కపై దాడి చేసిన ఘటన తెలిసిందే.  తాజాగా సోషల్ మీడియాలో ఓ చిరుత పులి రోడ్డుపై యధేచ్చగా నడుకుంటూ వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది.  ఇక తిరుమల ఘాట్ రోడ్డు పై ఎలుగు బంట్లు సంచరిస్తున్న వీడియో గురించి తెలిసిందే.  దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో కొన్ని పక్షులు, జంతువులు రోడ్డుపై విహరిస్తున్నాయి.

 

సాదు జంతువుల విషయం పెద్దగా పట్టించుకోవాల్సని అవసరం లేదు.. కానీ కృరమృగాలు సంచరిస్తే పరిస్థి ఏంటీ? తాజాగా మంచిర్యాల జిల్లా తాండురు మండలం గోపాలరావుపేట గ్రామ శివార్లలో పులి సంచరిస్తుడడం అక్కడి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో పంట పొలాలకు వెళ్లడానికి జనం భయపడుతున్నారు. కొందరు గ్రామంలో పుతి సంచరిస్తున్న విషయాన్ని అటవిశాఖ అధికారులకు తెలియజేశారు. 

 

పులిని బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. అదే సమయంలో గ్రామస్థులు, చుట్టుపక్కల వారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట పొలాలు.. గ్రామ శివార్లో ఉంటే మేకలు, గొర్ల కోసం కూడా ఇలాంటి కృరమృగాలు రావొచ్చని.. జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ వారు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: