దేశంలో కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసందే.  గత నెల  24 నుంచి లాక్ డౌన్ మొదలైంది.. కొత్తలో జనాలు చాలా జాగ్రత్తగా లాక్ డౌన్ పాటించినా.. మెల్ల మెల్లగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.  లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని ఎన్నో రకాలుగా నచ్చచెబుతున్నారు.  లాఠీకి పని చెబుతున్నారు.. దండం పెడుతున్నారు.. వార్నింగ్ ఇస్తున్నారు..ఇలా ఎన్నో రకాలుగా నచ్చజెబుతున్నారు.  కొన్ని చోట్లు చిత్ర విచిత్రమైన శిక్షలు అమలు పరుస్తున్నారు.  పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్‌డౌన్‌ అమలుపై చర్చించి.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

 

పూనేలో ఒకేసారి జనాలతో గుంజీలు తీయించారు.. మరికొన్ని చోట్ల మోకాళ్లపై నడవాల్సిందిగా సూచించారు.. లాఠీలకు పని చెబుతున్న విషయం తెలిసిందే.  అధికారులు ఎంతగా చెబుతున్నప్పటికీ కొందరు వినిపించుకోకుండా రహదారులపై తిరుగుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారికి పోలీసులు రోడ్లపైనే బుద్ధి చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోలీసులు వినూత్న రీతిలో శిక్ష విధించడం వైరల్‌గా మారింది.

 

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిని రోడ్డుపై నిలబెట్టిన పోలీసులు వారితో వ్యాయామం చేయించారు.  మిలటరీలో వ్యాయామాలు ఎలా చేయిస్తారో వారితో అలా చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లలోనే ఉండాలని, బయటకు వచ్చి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని వారు సూచించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: