క‌రోనా వైర‌స్ బారి నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు బాబుగారు తీవ్ర కృషి చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని ఇంట్లోనే కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అక్క‌డి నుంచి జ‌గ‌న్ స‌ర్కార్‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డం క‌న్నా.. విమ‌ర్శ‌లు చేయ‌డానికి బాగా శ్ర‌మిస్తున్నారు. ఇక ఈ క్ర‌మంలోనే బాబుగారి మ‌న‌సు ఒక్క‌సారిగా మీడియా మీద‌కు మ‌ళ్లింది. మీడియా మిత్రుల క్షేమం కోసం ఆలోచిస్తున్నారు. క‌రోనా నుంచి ఎలా కాపాడుకోవ‌చ్చునో ఆయ‌న వివ‌రిస్తున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా మీడియా మిత్రుల‌కు కొవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను వివ‌రించారు. *ప్రియమైన మీడియా సభ్యులారా.. మీరు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధులు. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే మీ కుటుంబాల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డం చాలా ముఖ్యం. రోజురోజుకూ క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్న జర్నలిస్టుల సంఖ్య పెరగడం చూస్తుంటే ఆందోళ‌న‌క‌రంగా ఉంది* అంటూ బాబుగారు చెప్పారు.

 

అంతేగాకుండా ఉచిత స‌ల‌హాలు కూడా ఇచ్చారు. *కొవిడ్‌-19నుంచి మ‌నల్ని మ‌నం కాపాడుకోవ‌డానికి ఏం చేయాలో..ఏం చేయ‌కూడ‌దో వివ‌రిస్తూ యూనిసెఫ్ రూపొందించిన చిత్రాల‌ను మీ ఫోన్ల‌లో సేవ్ చేసుకుని వాటిని పాటించ‌డానికి ప్ర‌య‌త్నం చేయండి. అలాగే వాటిని పాటించ‌డం ద్వారా క‌రోనాను ఎలా క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చో ప్ర‌పంచానికి చూపించండి* అంటూ కొవిడ్ జాగ్ర‌త్త‌ల ఉప‌న్యాసాన్ని ముగించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: