ఏపీలో క‌రోనా వైర‌స్‌ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు మోపిదేవి, సుచ‌రిత‌లు ఈరోజు స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. క‌రోనా నియంత్ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని తెలిపారు. ప్ర‌తీరెడ్ జోన్‌లో ప్ర‌త్యేక అధికారిని నియ‌మించామ‌ని తెలిపారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉన్న‌ గుంటూరు జిల్లాలోని రెడ్‌జోన్ల‌లో మ‌రోసారి స‌ర్వే చేప‌ట్టి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేప‌డుతామ‌ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం  5367మంది క‌రోనా అనుమానితుల‌ను గుర్తించి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా  5190 నెగెటివ్ కేసులు వ‌చ్చాయ‌ని తెలిపారు. కేవ‌లం 177 మాత్ర‌మే క‌రోనా పాజిటివ్ కేసులు వ‌చ్చాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

 

క్వారంటైన్ల‌లో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌లు స్వీయ‌నియంత్ర‌ణ‌తో భౌతిక‌దూరం పాటించాల‌ని సూచించారు. ప్ర‌తీ ఒక్క‌రు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని, ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న సూచించారు. అలాగే.. క‌రోనా వైర‌స్‌లు పెరుగుతున్న క‌ర్నూలు జిల్లాలోనూ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: