సంయుక్త హెగ్డే గురించి ద‌క్షిణ భార‌త దేశ సినిమా ప‌రిశ్ర‌మ‌కు పెద్దగా పరిచ‌యం అక్క‌ర్లేదు. ఈ క‌న్న‌డ కుర్ర‌ది క‌న్న‌డ సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా కిర్రాక్ పార్టీతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యి అతి త‌క్కువ టైంలోనే తిరుగులేని ఇమేజ్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం క‌న్న‌డ యూత్లో ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2016లో 17 సంవత్సరాల వయస్సులో ఆమె రక్షిత్ శెట్టి దర్శకత్వం వహించిన కిర్రాక్ పార్టీలో న‌టించ‌డం.. ఆ న‌టన‌కు విమ‌ర్శ‌ల‌కు ప్ర‌శంస‌లు రావ‌డంతో అక్క‌డ నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్ న‌చ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను అడిష‌న్‌కు పిల‌వ‌డం.. ఆమె హీరోయిన్ అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

 

ఆ త‌ర్వాత ఆమె తెలుగులో కూడా కిర్రాక్ పార్టీలో హీరోయిన్‌గా న‌టించింది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ద‌క్షిణ భార‌త్‌లో కుర్ర‌కారుకు స‌రిగా నిద్ర‌లేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆమె షేర్ చేసిన పిక్‌ల‌లో ఆమె హాట్ హాట్‌గా త‌న అంద‌చందాల‌తో క‌వ్విస్తోంది. ఆమె కొంటె క‌వ్వింపుల‌కు ప‌డ‌ని కుర్రాళ్లు ఉండ‌ర‌నుకోండి. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన పిక్‌లు చూస్తుంటేనే సెగ‌లు రేగుతున్నాయంటే ఆమె అంద చందాల హోయ‌లు ఎలా ఉంటాయో ? అర్థం చేసుకోండి...!

మరింత సమాచారం తెలుసుకోండి: