ప్ర‌స్తుతం ప్ర‌పంచ మహమ్మారితో పోరాటం చేస్తున్న అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ‌కు తోచిన‌ట్టుగా సాయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సినిమా రంగంలో హీరోలు సైతం ముందుకు వ‌చ్చి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సాయం చేయ‌డ‌మో లేదా ?  చారిటీలు ఏర్పాటు చేసి సినీ కార్మికుల‌ను ఆదుకోవ‌డ‌మో చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కోలీవుడ్ ఇళ‌య ‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు ప్ర‌జ‌ల‌కు త‌న వంతుగా అండ‌గా ఉండేందుకు విజ‌య్ ముందుకు వ‌చ్చాడు.

 

రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటించాడు. దీంతో విజయ్ ఇప్పటివరకు వివిధ రాష్ట్రప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి కలిపి మొత్తం 1.3 కోట్లను విరాళంగా ఇచ్చాడు. ఏపీ, తెలంగాణ‌, కర్ణాటక, పుదిచ్చేరి రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, స్వరాష్ట్రం తమిళనాడుకు రూ.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ సహాయనిధికి రూ.25 లక్షలు, దక్షిణ భారత నటుల సంఘానికి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. 

 

అయితే కోలీవుడ్‌కు చెందిన విజ‌య్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల‌కు విరాళాలు ఇవ్వ‌డంతో పాటు అటు కేంద్ర ప్ర‌భుత్వానికి విరాళాలు ఇవ్వ‌డంతో అత‌డిపై సోష‌ల్ ‌మీడియాలో ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. మ‌న తెలుగు హీరోల్లో ఇక్క‌డ మ‌న వాళ్లు ఏర్పాటు చేసిన చారిటీకే చాలా మంది విరాళాలు ఇవ్వ‌ని ప‌రిస్థితి. వీళ్ల‌తో పోలిస్తే నువ్వు నిజ‌మైన హీరోవి అని చాలా మంది ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: