మంచి మాటున చెడు కార్య‌కాల‌పాలు సాగించ‌డం.. అండిక‌కాడికి దండుకోవ‌డం..  పాక్ ఆక్ర‌మిత్ క‌శ్మీర్‌లోని ఉగ్ర‌వాదుల ప‌ని. క‌శ్మీరీల‌ను ర‌క్షిస్తున్నామంటూ.. అక్క‌డి మ‌హిళ‌ల‌నే వ్య‌భిచారరొంపిలో దింపి వారి జీవితాల‌తో ఆట‌లాడుకోవ‌డం వారికి కామ‌నే..!  అనేక మంది నాయ‌కులు గుట్టుగా సెక్స్ రాకెట్ న‌డిపిస్తూ ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాజాగా..  సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్న పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్‌ ఉల్‌ దవ(జేయూడీ) టాప్‌ నాయకుడు సయీద్‌ సమీర్‌ బుకారీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సమీపంలోని బాగ్‌ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.  బుకారీ అల్‌ మఫీజ్‌ ఫౌండేషన్‌ను నడిపిస్తున్నాడు.

 

ఇటీవ‌ల తన కార్యాలయానికి వచ్చిన ఓ మహిళను బ‌ల‌వంతంగా ఒప్పించేందుకు బుకారీ ప్రయత్నిస్తున్న వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో వైరల్‌ అయింది. బుకారీ బ్లడ్‌ బ్యాంక్‌ పేరుతో సెక్స్‌ రాకెట్‌ నడిపిస్తున్నట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. జేయూడీ చీఫ్‌  హఫీజ్‌ సయీద్‌కు బుకారీ కీలక అనుచరుడిగా కొనసాగుతున్నాడు. ప్ర‌ధానంగా భారత్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో బుకారీ చాలా చురుగ్గా పాలుపంచుకుంటాడ‌ట‌. కశ్మీర్‌ ప్రజలను కాపాడేవాళ్ల‌మ‌ని చెప్పుకునే జేయూడీ  సెక్స్‌, డ్రగ్స్‌ రాకెట్‌కు పాల్ప‌డుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: