దేశం వ్యాప్తంగా కరోనా మహమ్మారితో నానా కష్టాలు పడుతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.  ఈ సమయంలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు భద్రాచలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైతువారి పట్టాల తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు అలుముకన్నాయి. క్షణాల్లోనే మంటలు పక్కనున్న ఇళ్లను తాకడంతో దాదాపు 25 ఇళ్లు అగ్నికి దగ్ధమయ్యాయి. భారీగా ఆస్థినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

 

దట్టమైన పొగలతో బుసులుగొడుతూ మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అయితే అగ్ని దట్టంగా పెరిగిపోవడంతో స్థానికులు ఆర్పే ప్రయత్నం కూడా విఫలం అయ్యింది.  అగ్ని ప్రమాదం అన్న విషయం తెలుసుకున్న  పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  అసలే కరోనాతో కష్టాలు పడుతున్న సమయంలో తమ ఇళ్లు కాలి బూడిద అయ్యాయని అక్కడి వారు ఆవేదన చెందుతున్నారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: