క‌రోనా వైర‌స్ పుట్టుక‌కు, వ్యాప్తికి చైనాయే కార‌ణ‌మంటూ అమెరికా మొద‌టి నుంచీ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. కొవిడ్‌-19 ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలిసినా కూడా ప్ర‌పంచానికి చెప్ప‌లేద‌ని.. ఆ విష‌యాల‌ను కావాల‌నే దాచిపెట్టింద‌ని, నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోవ‌డానికి చైనాయే కార‌ణ‌మంటూ స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో క‌రోనాను చైనీస్ వైర‌స్ అంటూ ట్రంప్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.  ఇటీవ‌ల ఏకంగా చైనాకు ద‌ర్యాప్తు బృందాన్ని కూడా పంపుతామ‌ని ప్ర‌క‌టించారు.

 

ఈ క్ర‌మంలోనే మిస్సౌరీ రాష్ట్రం ఏకంగా అక్క‌డి కోర్టులో చైనా కేసు వేసింది. చైనా ప్రభుత్వం ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని, వైర‌స్ గురించి చెప్ప‌కుండా దాచిపెట్టింద‌ని ఆరోపిస్తూ మిస్సౌరీ అటార్నీ జనరల్ ఎరిక్ ష్మిత్ ఫెడ‌ర‌ల్ కోర్టులో లీగ‌ల్ పిటిష‌న్ వేశారు. ఇక దీనిపై టాలీవుడ్ హీరో నిఖిల్ కూడా స్పందించారు. ఎట్ట‌కేల‌కే చైనా ప్ర‌భుత్వంగా లీగ‌ల్ చ‌ర్య‌లు తీసుకునేందుకు కేసు వేసిన మొద‌టి రాష్ట్రం మిస్సౌరీ అని ట్వీట్ చేశారు. కాగా, మిస్సౌరీలో ఇప్ప‌టివ‌ర‌కు  6,105 మందికి క‌రోనా వైర‌స్ సోక‌గా 229 మంది మరణించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: