దేశంలో రోజు రోజకీ కరోనా మహమ్మారి ప్రబలి పోతుంది.  మహరాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు  లో బీభత్సం సృష్టిస్తుంది.  కరోనా మహమ్మారి మహారాష్ట్రను బెంబేలెత్తిస్తోంది. రోజులు గడుస్తుంటే పరిస్థితి అదుపులోకి రావాల్సింది పోయి మరింత ప్రమాదకరంగా మారుతోంది. నేడు ఒక్క రోజే ఏకంగా 18 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వం ఎన్ని కట్టడి చర్యలు తీసుకుంటునప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆశించిన స్థాయిలో తగ్గకపోవడం గమనార్హం. 

 

అంతేకాదు, నేడు కొత్తగా మరో 431 కేసులు వెలుగుచూసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 67 మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది.  దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5649కి చేరింది. మరణాల సంఖ్య 269కి చేరింది. బుధవారం నమోదైన 18 మరణాల్లో 10 మరణాలు ముంబైలోనే నమోదు కావడం గమనార్హం.

 

మహారాష్ట్రలో కరోనా బారిన పడిన వారిలో ఇప్పటిదాకా 789 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  దేశంలోనే అత్యధిక కరోనా కేసులు,మరణాలు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. నేడు మృతి చెందిన 18 మందిలో 10 మంది ముంబై నగరానికి చెందిన వారే కావడం గమనార్హం.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: