దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారి ఎలాంటి ఉపద్రవాలను తీసుకు వస్తుందో తెలిసిందే.  మనుషుల మద్య దూరాన్ని పెంచింది.. ఆర్థక సమస్యలు తీసుకు వచ్చింది.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా ఎఫెక్ట్ తో సతమతమవు తున్నారు.  తాజాగా హైదరాబాద్ శివారులోని మీర్‌పేటలో దారుణం జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 

ఒకేసారి ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులే  ఉండొచ్చని ప్రాధమిక అంచనాకు వచ్చారు పోలీసులు.  మృతుల్ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హరీశ్, ఆయన కుటుంబ సభ్యులుగా గుర్తించారు.  అపార్ట్ మెంట్ లో గత రెండు రోజుల నుంచి వీరి బయటకు రాకపోవడంతో అనుమానించిన ఇరుగుపొరుగు వారి ఇంటికి వెళ్లి చూడగా, ‘ఈ తలుపు తెరవండి ప్లీజ్’ అనే కాగితం అతికించి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

 

ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు తలుపు తెరిచి చూడగా కుటుంబ సభ్యులు నలుగురు విగత జీవులుగా కనిపించారు. మృతులను హరీష్‌, స్వప్న గిరీష్‌, సువర్ణగా గుర్తించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: