లాక్‌డౌన్ కార‌ణంగా సెల‌బ్రెటీలంతా ఇండ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఇంటి ప‌ని, వంట ప‌ని చేస్తూ... సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్న సంగ‌తి  తెలిసిందే.  ఇంటి పనులను మగవాళ్లు కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్‌ వంగ  ‘బీ ది రియల్‌ మేన్‌’  ఛాలెంజ్‌ ను స్టార్ట్‌ చేశారు.   ఈ ఛాలెంజ్‌ను‌ సందీప్‌ వంగ నుంచి రాజమౌళికి, అతడి నుంచి సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి, దర్శకుడు క్రిష్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్ కి  చేరింది.

అలాగే ఎన్టీఆర్‌ ఛాలెంజ్‌ విసరడంతో కొరటాల శివ పాత్రలు శుభ్రం చేస్తూ, ఫ్లోర్‌ క్లీన్‌ చేస్తూ ఇంటి పనుల్లో సహాయం చేస్తున్న వీడియోను ట్వీటర్‌ లో షేర్ చేశాడు. ఈ ఛాలెంజ్‌ కి విజయ్‌ దేవరకొండను నామినేట్‌ చేశారాయన. రాజమౌళి  విసిరిన ఛాలెంజ్‌ ను స్వీకరించిన సుకుమార్‌.. ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. ఇల్లు తుడుస్తూ, గిన్నెలు శుభ్రం చేస్తున్న వీడియోను షేర్‌ చేసి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత ‘దిల్‌’రాజులను నామినేట్‌ చేశారు సుకుమార్‌.

లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించారు.  ఫ్లోర్‌ క్లీన్‌ చేస్తూ ఇంటి పనుల్లో నిమ‌గ్న‌మైన వీడియోను ట్వీటర్‌ లో షేర్ చేశారు చిరు. అంతేగాక వంటిట్లో దోశ వేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు మెగాస్టార్‌. అంతేగాక  తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, త‌మిళ సూప‌ర్ స్టార్  ర‌జ‌నీకాంత్‌కు ‘బీ ది రియల్‌ మేన్‌’  ఛాలెంజ్‌ను విసిరారు చిరంజీవి. 

మరింత సమాచారం తెలుసుకోండి: