ఇప్పుడంతా *బీ ద రియ‌ల్ మ్యాన్‌* ట్రెండ్ న‌డుస్తోంది. ఇందులో ప్ర‌ధానంగా టాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌కులు త‌దిత‌ర ప్ర‌ముఖులు ఎక్కువ‌గా పాల్గొంటున్నారు. నిన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ విసిరిన స‌వాల్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వీక‌రించాడు. వంటింట్లో చ‌క్క‌గా దోష వేసి, నేరుగా అమ్మ‌వ‌ద్ద‌కు వెళ్లి తినిపించాడు. * తార‌క్‌.. నేను రోజూ చేసే ప‌నులే.. ఇవ్వాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం* అంటూ ట్వీట్ చేశారు. ఇక  ఇదే సంద‌ర్భంగా చిరంజీవి టాప్ హీరో, టాప్ లీడ‌ర్‌ను నామినేట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు, హీరో ర‌జ‌నీకాంత్‌కు ఆయ‌న స‌వాల్ విసిరారు.

 

ఇక చిరు స‌వాల్‌పై కేటీఆర్‌, ర‌జ‌నీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి. వీరి స్పంద‌న కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ ఎలాంటి వీడియో పోస్ట్ చేస్తారోన‌ని,  ఎవ‌రిని నామినేట్ చేస్తారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కేటీఆర్ వీడియోతో *బీ ద రియ‌ల్ మ్యాన్‌* ఛాలెంజ్ స‌రికొత్త  రూపును దాల్చుతుంద‌ని అభిమానులు అప్ప‌డే సందడి మొద‌లు పెట్టారు. ఇక నుంచి ఇందులో రాజ‌కీయ నాయ‌కులు కూడా ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: