ఈటివి లో ప్రసారమయ్యే జబర్దస్త్ క్రేజ్ ఏంటో ఎవ్వరికి చెప్పక్కర్లేదు. తెలుగు బుల్లితెర‌పై ఈ షో కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంది. బుల్లితెర‌పై ఈ షో వ‌స్తుందంటే చాలు ఆ టైంకు టీవీల‌కు అతుక్కుపోయి కోట్లాది మంది అభిమానులు చూస్తుంటారు. ఒక్క‌సారి ఈ ప్రోగ్రామ్‌లోకి ఎంట‌ర్ అయ్యారంటే వారి జీవితాలే మారిపోతుంటాయి. ఈ ప్రోగ్రామ్ ద్వారా స‌క్సెస్ అయిన వాళ్ల‌కు కావాల్సినంత పేరు, డ‌బ్బులు కూడా వ‌స్తుంటాయి. ఇక మ‌రి కొంద‌రు ఇక్క‌డ వ‌చ్చిన పేరుతోనే వెండితెర మీద కూడా ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయ్యారు.

 

కొంద‌రు క‌మెడియ‌న్లు మ‌ధ్య‌లో జ‌బ‌ర్ద‌స్త్‌ను వ‌దిలిపెట్టినా ఇక్క‌డ ఉన్న పేరు మ‌రెక్క‌డా రాలేదు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ కూడా జబర్దస్త్ ని సడన్ గా వదిలేసి వెండితెర మీద వెలిగిపోతున్నాడు. అయితే అత‌డు జ‌బ‌ర్ద‌స్త్‌ను ఎందుకు వ‌దిలి పెట్టాల్సి వ‌చ్చిందో కూడా చెపుతున్నాడు. స్వామిరారా సినిమాలో హీరో నిఖిల్‌తో ఈక్వ‌ల్ రోల్ చేశాడు స‌త్య‌. ఆ సినిమా త‌ర్వాత జ‌బ‌ర్ద‌స్త్‌లో చేరి ధ‌న్‌రాజ్‌తో కొన్ని కామెడీ స్కిట్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.

 

జ‌బ‌ర్ద‌స్త్‌లో స‌త్య‌కు కావాల్సినంత పేరుతో పాటు మంచి అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి. ఆ త‌ర్వాత భారీ రిస్క్ చేసి జ‌బ‌ర్ద‌స్త్‌ను వ‌దిలేసి వెండితెర‌మీద‌కు వ‌చ్చాడు. ఆ రిస్క్‌కు ఇక్క‌డ వెండితెర‌మీద కావాల్సినంత ప్ర‌తిఫ‌లం ద‌క్క‌డంతో మ‌ళ్లీ మ‌నోడు జ‌బ‌ర్ద‌స్త్ వైపే చూడ‌లేదంటున్నాడు. ఇక మత్తువదలరా సినిమాలో సూపర్ కామెడీ పాత్రతో బాగా హైలెట్ అయ్యాడు. తాజాగా సత్య నటించిన రెండు మూడు సినిమాలు విడుదల కావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: