కరోనా పేరుతో బీజేపీ ద్వేషం, మత తత్వమనే వైరస్‌లను దేశంలో వ్యాపింప చేస్తోందని ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ వ ర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప‌లు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 
ఫస్ట్ లాక్‌డౌన్‌తో 12 కోట్ల మంది నిరుద్యోగులయ్యారని చెప్పిన ఆమె ప్రతి కుటుంబానికి కేంద్రం 7500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా రైతులు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. 

 

దేశవ్యాప్తంగా అతి తక్కువగా కరోనా టెస్టులు జరుపుతున్నారని, పీపీఈ కిట్లు నాసిరకానివి వాడుతున్నారని సోనియా ఆరోపించారు. కరోనా కట్టడికి యత్నిస్తోన్న డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు అభినందనీయులని సోనియా అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: