ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ది రియల్‌ మ్యాన్‌’ ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇంటి పనులను మగవాళ్లు కూడా పంచుకోవాలనే ఉద్దేశంతో దర్శకుడు సందీప్‌ వంగ స్టార్‌ చేసిన  ‘బీ ది రియల్‌ మ్యాన్‌’  ఛాలెంజ్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. తాజాగా హీరో ఎన్టీఆర్‌ నుంచి ఈ చాలెంజ్‌ను స్వీకరించిన మెగాస్టార్‌ చిరంజీవి.. దానిని విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో చిరంజీవి తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ చాలెంజ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను, హీరో రజనీకాంత్‌ను చిరంజీవి నామినేట్‌ చేశారు. 

ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీయార్ నుంచి విక్ట‌రీ వెంక‌టేశ్ ‘బి ది రియల్‌ మ్యాన్‌’  ఛాలెంజ్‌ను స్వీకరించిన వెంకటేశ్ తన టాస్క్‌ను పూర్తి చేశారు. ఇంటిని శుభ్రం చేసి, తోట పనిచేసి, వంట చేసి ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇంటి పనిలో సహాయం చేసి నిజమైన మగాడిగా నిలుద్దామని ట్వీట్ చేశారు. అనంతరం ఈ ఛాలెంజ్ కోసం మహేశ్‌బాబును, వరుణ్ తేజ్‌ను, డైరెక్టర్ అనిల్ రావిపూడిని నామినేట్ చేస్తున్నట్టు వెంక‌టేశ్ పేర్కొన్నాడు. అయితే వెంక‌టేశ్ చాలెంజ్‌ను ఈ ముగ్గురిలో ఎవ‌రు ముందుగా స్వీక‌రిస్తారో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: