అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ స్ట్రీమింగ్ యాప్స్ మన దేశంతో పాటుగా తెలుగు ఆడియెన్స్‌లో సూప‌ర్ పాపులార్టీ తెచ్చుకున్నాయి. అయితే వీట‌న్నింటికి భిన్నంగా తెలుగులో మంచి స్ట్రీమింగ్ యాప్ అందుబాటులోకి వ‌చ్చింది. అగ్ర నిర్మాత‌, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ ఆధ్వ‌ర్యంలో ఈ యాప్ స్టార్ట్ అయ్యింది. భారీ అంచ‌నాలతో ప్రారంభ‌మైన ఈ యాప్ గ‌త డిసెంబ‌ర్లో ప్రారంభ‌మైంది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఉన్న సినిమాలే కొన్ని ఆహా లో కూడా కనిపిస్తున్నాయన్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 

కొద్ది రోజుల క్రిత‌మే రాజావారు రాణివారు సినిమాను అమోజాన్ ఫ్రైమ్‌లో ఉండ‌గా.. అదే ఆహాలో కూడా స్ట్రీమ్ చేశారు. దీనిపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఒక్క‌టే సినిమా రెండు యాప్‌ల‌లో ఎందుకు బాబు అని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇక ఇప్పుడు మ‌రో సినిమా కూడా అలాగే వ‌చ్చింది. “ అనుకున్నది ఒకటి అయినది ఒకటి ” కూడా ఆహా లో ఉందని చెప్పగా అది కూడా అమెజాన్ ప్రైమ్ లో ఉంది ఆమాత్రం దానికి ఆహా లో కూడా ఎందుకని నెటిజన్స్ ఆడుకుంటున్నారు. మ‌రి దీనిపై అర‌వింద్ &  టీం ఇక‌పై ఏం చేస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: