ప్ర‌భుత్వ ఉద్యుగుల‌కు, పెన్స‌న‌ర్ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ షాక్ ఇచ్చారు. గతంలో ప్రకటించిన కరువు భత్యం (డీఏ)ను రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుని గురువారం మ‌ధ్యాహ్నం ఉత్త‌ర్వులు జారీ చేశారు. నిజానికి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గతంలో కేంద్ర ప్ర‌భుత్వం డీఏను పెంచింది.  జూలై 2021 వరకు పెంచిన డీఏ పెంపు నిలిపేశారు. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిల చెల్లింపు కూడా ఉండదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డీఏ మాత్రమే కొనసాగుతుందని తెలిపారు. ఈ నిర్ణయం ప్రభావం దేశవ్యాప్తంగా వున్న కోటీ 30 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లపై వుంటుందని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 

కరువు భత్యం నిలుపుదల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.14 వేల 510 పది కోట్లు ఆదా అవుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. పెంచిన ఈ డీఏను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయ‌డంతో ఉద్యోగ‌వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నిజానికి.. ఉద్యోగుల వేత‌నాల్లో కోత ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ.. మోడీ అటువైపుగా వెళ్ల‌కుండా కరువు భత్యంలో మాత్ర‌మే కోత విధించ‌డం గ‌మ‌నార్హం. నిన్న ప్ర‌భుత్వ వైద్యుల‌కు అండ‌గా నిలుస్తూ ఏకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్న మోడీ.. ఆ మ‌రునాడే.. ఉద్యోగుల‌కు షాక్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: