పాత తరంలో పెళ్లిళ్లు పెద్దల ఇష్టప్రకారం చిన్న తనంలోనే జరిగేవి.  అప్పటి నుంచి ఉమ్మడి కుటుంబాల్లో  ఆ జంట ఎంతో అన్యోనంగా పిల్లా పాపలతో సుఖంగా జీవించే వారు.  కానీ నేటి తరం పూర్తిగా మారిపోయింది.. ఉమ్మడి కుటుంబాలు దాదాపు అంతరించిపోతున్నాయి. బాల్య వివాహాలు రద్దు అయ్యాయి.. ప్రేమ వివాహాలు పెరిగిపోయాయి.  తాజాగా తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ పెళ్లినాటి ఫోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పెళ్లి ప్రస్తావన తీసుకు వస్తూ..నాకు ఎప్పుడో చిన్నప్పుడే పెళ్లైందని అనేవారు. 

IHG

కాకపోతే ఆయన పెళ్లినాటి ఫోటోలు మాత్రం ఎప్పుడు బయటకు రాలేదు.   ఈ రోజు సీఎం పెళ్లిరోజు సందర్భంగా ఆయన బంధువు, టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్ ఈ ఫొటోను బయటపెట్టారు.  చిన్న వయసులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణి శోభ ఫోటో చూడ ముచ్చటగా ఉంది. కేసీఆర్, ఆయన భార్య శోభల ఫొటోలతోపాటు తన తల్లిదండ్రుల పెళ్లినాటి ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. తల్లిదండ్రుల లాంటి పేరెంట్స్ లభించడం అదృష్టం. 

IHG

పెద్దనాన్న.. పెద్దమ్మ మీలాంటి గొప్పవారు  నా జీవితంలో మీరు దక్కడం మహాభాగ్యం.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ట్విట్ చేశారు ఎంపీ జోగినపల్లి సంతోష్‌. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: