సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్‌ యూజ‌ర్ల‌కు ఇది గుడ్ న్యూస్‌.. ప్లెక్స్ మోడ్ స‌పోర్ట్ చేస్తూ యూట్యూబ్ స‌రికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోన్‌ను సగం మ‌లిచిన త‌ర్వాత కూడా ఎగువ సగం యూజర్లు నిరంతరాయంగా వీడియోలు చూసేలా ఫీచ‌ర్ వ‌చ్చింది. ఇక స్క్రీన్ దిగువ భాగంలో బ్రౌజ్  చేసుకునే అవ‌కాశం కూడా ఉంది. ఇది యూజ‌ర్ల‌కు మంచి ఫీలింగ్‌ను ఇచ్చే ఫీచ‌ర్ అని చెప్పొచ్చు. యూట్యూబ్ తీసుకొచ్చిన తాజా అప్‌డేట్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. నిజానికి.. ఈ ఫోన్ ఇంకా బార‌త్‌లో రిలీజ్ కాలేదు.  సాధారణ 16: 9 ల్యాండ్‌స్కేప్ వీడియో స్పష్టంగా చూడటానికి సౌకర్యంగా లేనప్పటికీ, ఈ మోడ్ అన్ని రకాల యూట్యూబ్ వీడియో పరిమాణాలు, ఫార్మాట్‌ల కోసం ఆప్టిమైజ్ చేసిన‌ట్లు శామ్‌సంగ్ హామీ ఇచ్చింది.

 

గత ప‌దేళ్లుగా శామ్సంగ్-గూగుల్ భాగస్వామ్యంలో అనేక అద్భుత ఆవిష్క‌ర‌ణ‌లు వ‌చ్చాయ‌ని సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్ అధ్యక్షుడు, మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ హెడ్ టిఎం రోహ్ తెలిపారు. ఇప్పుడు మా భాగ‌స్వామ్యంలో వ‌చ్చిన ఈ స‌రికొత్త ఫీచ‌ర్ మ‌రో కొత్త త‌రానికి నాంది ప‌లుకుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు. కాగా, వీడియో కాల్స్ కోసం ఫ్లెక్స్ మోడ్ కూడా ఎంతో సుల‌భంగా ఉంటుంది. గూగుల్ డుయో కూడా ఇందుకు స‌పోర్ట్ ఇస్తుంది. వీడియో చాట్‌లు స్క్రీన్ పైభాగంలో కనిపిస్తాయి. కంట్రోల్ ప్యాడ్ దిగువ‌భాగంలో ఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: