దేశంలో కరోనా మహమ్మారి వల్ల ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం మీద ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 4,85,172 మంది నుంచి 5,00,542 శాంపిళ్లు తీసుకుని పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి ప్రకటన చేసింది. వారిలో ఇప్పటివరకు 21,797 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలాయని ప్రకటించింది. అయితే, దేశం మొత్తం మీద ఈ రోజు ఉదయం వరకు 21,359 కేసులు నమోదయ్యాయని అంతకుముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  

 

తమిళనాడు, మహారాష్ట్రలో పలువురు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు మీడియా ఆలోచనలో పడింది.. ప్రాణాలకు తెగించి కవరేజ్ చేస్తే మా ప్రాణాల మీదకు వస్తుందని కొంత మంది భయపడుతున్నారు.  ఈ నేపథ్యంలో  ఈ క్ర‌మంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయి.  

 

తాజాగా హర్యాన ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించింది. ప్రతి జర్నలిస్టుకు రూ. 10 లక్షల చొప్పున బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు హర్యానా సీఎం మనోహర్ లాల్‌ ఖట్టర్. సీఎం మనోహర్‌ లాల్‌ నిర్ణయం పట్ల హర్యానా జర్నలిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: