ప్ర‌కాశ్‌రాజ్‌..ప‌రిచ‌యం అక్క‌ర‌లేని న‌టుడు. తెలుగుతోపాటు అనేక భాష‌ల్లో త‌న‌దైన న‌ట‌న‌, డైలాగ్స్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేశాడు. నిజానికి..ప్ర‌కాశ్‌రాజ్ అంటే.. సినిమాలు మాత్ర‌మేగాదు.. మ‌న‌కు తెలియ‌ని మ‌రో జీవితం ఉంది.. సినిమాలు ఆయ‌న జీవితంలో కేవ‌లం 5శాతం మాత్ర‌మే.. 95శాతం ఇత‌ర అంశాలే. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. అందుకే సినిమాల‌ను ప‌క్క‌న‌బెడితే.. ఆయ‌న జీవితం గురించి మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు ఉన్నాయి. మ‌న‌కు క‌నిపించ‌ని మ‌రెన్నో కోణాలు ఆయ‌న‌లో ఉన్నాయి. ఆయ‌న మ‌నిషిని మ‌నిషిలాగే చూస్తాడు.. ఉన్న‌వాళ్లు..లేనివాళ్లు అన్న‌తేడాలేకుండా..కుల‌మతాల‌కు అతీతంగా మ‌నిషిని మాత్ర‌మే ప్రేమిస్తాడు. సినిమాలుచేయ‌డం ద్వారా వ‌చ్చిన డ‌బ్బును మొత్తం దాదాపుగా సేవాకార్య‌క్ర‌మాల‌కే కేటాయిస్త‌న్నారు. ఫౌండేష‌న్లు కూడా న‌డిపిస్తున్నారు. సుమారు మూడు ఊళ్ల‌ను ద‌త్త‌త తీసుకున్నారు. మ‌రో ఐదారు పాఠ‌శాల‌ల‌కు సాయం అందిస్తున్నారు.

 

ఈ నేప‌థ్యంలోనే క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పేద‌ల అవ‌స‌రాలు తీర్చేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈరోజు ఓ చానెల్‌తో ప్ర‌కాశ్ రాజ్ మాట్లాడుతూ.. త‌న జీవితానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు. సేవ చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని, దానికోసం తాను సంపాదించిన డ‌బ్బంతా ఖ‌ర్చు చేస్తాన‌ని చెప్పారు. డ‌బ్బంతా పోయినా..తాను అడిగితే ఇచ్చేవాళ్లు చాలా మంది ఉన్నారంటూ చెప్పారు. ఈక్ర‌మంలో టాలీవుడ్ టాప్ హీరో మ‌హేశ్‌బాబు గురించి ప్ర‌స్తావించారు. ఒక సంద‌ర్భంలో తాను మ‌హేశ్‌బాబును సాయం అడిగితే వెంట‌నే పంపించార‌ని ప్ర‌కాశ్‌రాజ్ పేర్కొన్నారు. ఇత‌రుల‌కు సాయం చేయ‌డం త‌న త‌ల్లి నుంచి నేర్చుకున్నాని ప్ర‌కాశ్ చెప్పుకొచ్చారు.    

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: