మహారాష్ట్రలో కరోనా రక్కసి పంజా విసురుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 778 కొత్త కేసులు నమోదు కాగా 14 మంది మృతి చెందారు. నిన్న నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 6427కు చేరింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో నిన్న ఒక్కరోజే 522 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో ముంబైలో కరోనా కేసుల సంఖ్య 4,205కు చేరింది. 
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. మహారాష్ట్రలో మంత్రి జితేంద్ర అహ్వాద్ కు కరోనా సోకింది. పది రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ రాగా తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితం మంత్రి జితేంద్ర భద్రతా సిబ్బందిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన అప్పటినుంచి హోం క్వారంటైన్ లో ఉన్నారు. 
 
తాజాగా మంత్రికి పాజిటివ్ రావడంతో మహారాష్ట్ర కేబినెట్ లో తీవ్ర ఆందోళన నెలకొంది. మంత్రికి కరోనా సోకడంతో ఆయనకు కాంటాక్ట్ లో ఉన్న 100 మందికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: