ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.  తాజాగా ప్రపంచవ్యాప్తంగా 27, 14, 995 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 1,90,397 మంది మృతి చెందగా,  7,44,961 మంది బా ధితులు కరోనా బారిన పడి కోలుకున్నారు.

 

ముఖ్యంగా అగ్ర‌రాజ్యం అమెరికా క‌రోనా వైర‌స్ తో చివురుటాకులా వ‌ణికిపోతోంది.  అమెరికాలో 8,78,974 పాజిటివ్‌ కేసులు న‌మోదుకాగా, వైర‌స్ బారిన ప‌డి 49,755 మంది మృతి చెందారు. ఇక  ఇటలీలో 1,89,979 పాజిటివ్‌ కేసులు న‌మోదు కాగా 25,549 మంది మృతి చెందారు. స్పెయిన్‌లోనూ క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో  2,13,024 పాజిటివ్‌ కేసులు న‌మోదు కాగా, 22,157 మంది ప్రాణాల‌ను మ‌హ‌మ్మారి హ‌రించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: