వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం వ్రాసిన ... శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందినది. పుణ్య క్షేత్రంగా విరాజలిల్లుతున్న శ్రీకాళహస్తి ఇప్పుడు అష్ఠదిగ్భందంలో ఉంది. కేవలం 80 వేల జనాభా ఉన్న చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఏకంగా 40కి పైగా కరోనా కేసులు నమోదు కావడంతో పట్టణాన్ని అధికారులు అష్టదిగ్బంధం చేశారు.

 

ఇక్కడ లాక్ డౌన్ సంపూర్ణంగా విధించారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి ప్రజలు ఎవరినీ బయటకు వెళ్లనివ్వబోమని, పాలు, మందులు, నిత్యావసరాలను వలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దనే అందిస్తామని అధికారులు ప్రకటించారు. పెట్రోల్‌ బంకులను పూర్తిగా మూసివేశారు. కరోనా కట్టడికి రాష్ట్రంలోనే అత్యంత కఠిన నిబంధనలను శ్రీకాళహస్తిలో అమలు చేయాలని నిర్ణయించామని, ఎవరైనా తమ ఆదేశాలు అతిక్రమిస్తే డిజాస్టర్‌ మేనేజ్ ‌మెంట్‌ చట్టం కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు.

 

అంతే కాదు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో మూడు గంటల పాటు సడలింపు ఉండేది.. ఇప్పుడు ఇక్క అది కూడా తీసివేశారు. ఈ మేరకు నిన్న రాత్రి పోలీసు ఎస్కార్ట్‌ వాహనాలతో ర్యాలీ చేస్తూ, నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మైక్‌ అనౌన్స్ ‌మెంట్ చేశారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: