ప్రపంచంలో ఇప్పుడు కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాపించింది. అమెరికాలో క‌రోనా వైర‌స్ మృతుల సంఖ్య 50వేలు దాటింది. వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సంఖ్య‌లో జ‌నం అమెరికాలోనే మ‌ర‌ణించారు.  నోవెల్ క‌రోనా వ‌ల్ల అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 50442గా రికార్డు అయ్యింది.  అయితే కొన్ని రాష్ట్రాల‌పై అధ్య‌క్షుడు ట్రంప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  ఈ దిక్కుమాలిన వైరస్  సంక్ర‌మించిన వారి సంఖ్య‌ 891627, ఇక వైర‌స్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 82268గా ఉన్న‌ది. 

 

మొదట ఇక్కడ లాక్ డౌన్ పై వ్యతిరేకత వచ్చినా.. ఆ త‌ర్వాత ట్రంప్ త‌న మాట మార్చారు.  క‌ఠిన ఆంక్ష‌ల‌ను ఇంకా అమ‌లు చేయాల‌ని ఆయ‌న ఆయా రాష్ట్రాల‌కు సూచించారు.  ఇవాళ అమెరికా స‌ర్కార్‌.. 484 బిలియ‌న్ల డాల‌ర్ల ఉద్దీప‌న్ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.

 

చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు, వైర‌స్ ప‌రీక్ష‌ల‌కు ఆ నిధుల‌ను కేటాయిస్తారు. కాగా కరోనా ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని .. ట్రంప్ ప్ర‌భుత్వం నాలుగోసారి రిలీఫ్ ప్యాకేజీని ప్ర‌క‌టించింది.  దేశంలో నిరుద్యోగం కూడా హెచ్చు స్థాయికి చేరుకున్న‌ది.  సుమారు 27 మిలియ‌న్ల మంది నిరుద్యోగ భృతి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: