ఏపీ రాజధాని తరలింపుపై జేఏసీ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు ధర్మాసనం విచారించింది. రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్లు వాదించారు. అడ్వకేట్ జనరల్ రాజధాని వికేంద్రీకరణ బిల్లులు పాస్ అవ్వకుండా రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని చెప్పారు. ఇదే విషయంతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ కు సూచించింది. పదిరోజుల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 
 
సీఎం జగన్ కొన్ని నెలల క్రితం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పిటిషనర్లు కొన్నిరోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజధానిని విశాఖకు తరలించటాన్ని ఆపటం ఎవరి తరం కాదని వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలను కూడా పిటిషన్ లో పొందుపరిచారని సమాచారం. 
 
ఈ విషయంపై అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు వివరణ కోరగా బిల్లులు పాస్ అయిన తరువాత మాత్రమే రాజధానిని తరలిస్తామని ప్రకటన చేశారు. దీంతో హైకోర్టు ఇదే విషయంపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: