ప్రపంచంలో ఏ దర్మూహూర్తంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం మొదలు పెట్టిందో కానీ.. ప్రజల పిట్టల్లా రాలిపోతున్నారు.  ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి అగ్రదేశాల్లోమొన్నటి వరకు మరణ మృదంగం మోగించినా.. కొద్దిగా దగ్గిందని అంటున్నారు. కానీ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం కరాళ నృత్యం చేస్తుంది.. ఇప్పటికే 50 వేల మంది మృత్యువాత పడ్డారు. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక భారత దేశం నుంచి వివిధ దేశాలకు డబ్బు సంపాదించే క్రమంలో వలస వేళ్లారు. కరోనా నేపథ్యంలో చాలా మంది ఆయాదేశాల్లో చిక్కుపోయారు.  దాంతో ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

 

బతుకుతెరువు కోసం ఎడారి దేశం సౌదీ అరేబియాకు వెళ్లిన 11 మంది భారతీయులను కరోనా రక్కసి కాటేసింది. కరోనా బారిన పడి 11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని సౌదీలోని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. మదీనాలో నలుగురు, జెడ్డాలో ఇద్దరు, మక్కాలో ముగ్గురు, రియాద్, దమ్మమ్ లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని వెల్లడించారు. మరోవైపు సౌదీలో ఇప్పటి వరకు 13,930 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 121 మంది మృతి చెందారు. సౌదీలో ఉన్న ప్రవాస భారతీయులంతా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు.  మరికొంత కాలంగా ఈ కరోనా ప్రభావం ఉంటుందని.. అప్పటివరకు ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతుకు పోరాటం చేస్తున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: