క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ను పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ పలువురు మాత్రం ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. కొంద‌రు అత్య‌వ‌స‌ర ప‌నుల మీద బ‌య‌ట‌కు వ‌స్తున్నా... కొంద‌రు యువ‌కులు మాత్రం ఇష్ట‌మొచ్చిన‌ట్లు రోడ్ల‌మీద‌కు వ‌చ్చి బైక్ రైడింగ్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ట్రాఫిక్ ఉండ‌ద‌ని.. అందుకే తాము రోడ్ల‌మీద‌కు రైడింగ్‌కు వ‌స్తున్నామ‌ని వారు చెపుతోన్న స‌మాధానాల‌తో పోలీసుల‌కే షాక్ అవుతున్నారు.

 

తాజాగా త‌మిళ‌నాడు పోలీసులు ఇలాంటి చిల్ల‌ర వేషాలు వేస్తోన్న ఆకతాయిలకు ‘కరోనా సినిమా’ చూపించారు. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను ఆపి.. కరోనా పేషెంట్‌ ఉన్న అంబులెన్స్‌లోకి ఎక్కించి బుద్ధి చెప్పారు. రోడ్ల మీద‌కు వ‌చ్చిన వారిని వెంట‌నే క‌రోనా రోగి ఉన్న అంబులెన్స్ లేదా గ‌దిలో వేస్తామ‌ని వార్నింగ్ ఇవ్వ‌డంతో వారు గ‌గ్గోలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: