ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మోదీ కరోనా కట్టడి కొరకు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. సర్పంచులు కరోనా కట్టడి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. మెరుగైన సేవలు అందించి పురస్కారాలు పొందిన సర్పంచులకు అభినందనలు తెలిపారు. 
 
దేశంలో కరోనా వల్ల విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని... ఇలాంటి సమయంలో సర్పంచులు పేదలకు ఆహార ధాన్యాలను అందించాలని సూచనలు చేశారు. పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్ మెరుగుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు ఎంతో కృషి చేస్తోందని అన్నారు. పంచాయతీ వ్యవస్థ ఎంత బలపడితే ప్రజా వ్యవస్థ అంత బలపడుతుందని చెప్పారు. 
 
కష్ట సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండాలని.... ప్రజలంతా ఇళ్లకే పరిమితమై కరోనాను తరిమి కొట్టాలని చెప్పారు. కరోనా ఎన్నో పాఠాలను నేర్పిందని మోదీ అన్నారు. మనం వెళ్లే దారిలో అనేక ఆటంకాలు కలుగుతాయని... గ్రామాల్లో ప్రజలకు కరోనాపై మరింత అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: