మ‌మ‌తా బెనర్జీ.. ఈ పేరు వింటేనే ఎంత‌టి రాజ‌కీయ‌నాయ‌కులైనా వ‌ణుకుపుడుతుంది. ప్ర‌త్య‌ర్థుల‌ను ఆటాడుకోవ‌డంలో మ‌మ‌తా బెన‌ర్జీ పంథానే వేరు.. కొద్దిరోజులుగా క‌రోనా వైర‌స్ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి, ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం మ‌ధ్య మాట‌ల‌యుద్ధం న‌డుస్తోంది. కేంద్రం పంపిన బృందాల‌ను కూడా రాష్ట్రంలోకి అనుమ‌తించ‌లేదు మ‌మ‌తాబెన‌ర్జీ. అలాగే.. ఈ మ‌ధ్య గ‌వ‌ర్న‌ర్ కూడా మ‌మ‌త పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఒక‌ద‌శ‌లో మీడియాతో కూడా గ‌వ‌ర్న‌ర్‌ మాట్లాడారు. ఈ క్ర‌మంలో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్ ధంఖర్‌పై ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తాను ప్రజల చేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రి అయ్యాయని, గవర్నర్‌ కేంద్రం చేత నామినేట్‌ చేయబడ్డారని ప‌రోక్షంగా హెచ్చ‌రించారు. గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పదేపదే జోక్యం చేసుకోవడంపై మమత తీవ్ర‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ ధర్మాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 

 

 ఈ నేపథ్యంలోనే గవర్నర్‌కు మమత ఐదు పేజీల లేఖ రాశారు. గవర్నర్‌ వాడుతున్న భాష ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అవమానించేలా ఉందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. గవర్నర్‌ అధికారాలు తెలుసుకోవాలని చుర‌క‌లు అంటించారు. ఆ లేఖ‌లో చాలా ఘాటుగా.. సూటిగానే ప్ర‌శ్నించారు. *నేను  ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని..  మీరు నామినేట్‌ చేయబడిన గవర్నర్‌ అనే సంగతి మ‌ర్చిపోయి మాట్లాడుతున్నారు. గవర్నర్‌ నుంచి వస్తున్న లేఖల్లో వాడుతున్న భాష, సందేశాలు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అవమానించేలా ఉన్నాయి. మీరు నాపై, మంత్రులపై, ప్రభుత్వ అధికారులపై దాడికి దిగుతున్నారు. మీరు మాట్లాడే ధోరణి, తీవ్ర అభ్యంత‌ర‌కరంగా ఉంది* అని మమతా లేఖలో  పేర్కొన్నారు. గవర్నర్‌ తరుచూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప‌రిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: