దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది.  తెలుగు రాష్ట్రాల్లోకూడా కరోనా పంజా విసురుతుంది.  తగ్గుతున్నట్టే అనిపిస్తున్నా.. కేసులు మాత్రం నమోదు అవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 955కు చేరింది. ఏపీలో శుక్రవారం కరోనా ప్రభావంతో ఇద్దరు మృతి చెందారు. కరోనాతో అనంతపురంలో ఒకరు, కర్నూలులో ఒకరు మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు ఏపీలో 145 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మొత్తం ఇప్పటివరకూ 29 మంది మృతి చెందారు.

 

కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 781గా ఉంది. 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 6,306 నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. కర్నూలు 261, గుంటూరు 206, కృష్ణా 102, చిత్తూరు 73, నెల్లూరు 68, ప్రకాశం 53,  కడప 51,  అనంతపురం 46,  తూర్పుగోదావరి 34, పశ్చిమగోదావరి 39, విశాఖలో 22, విజయనగరం, శ్రీకాకుళం 0 నమోదు అయ్యాయి. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: